తెలంగాణ
Hyderabad: గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో దారుణం.. మార్ఫింగ్ వీడియోలతో బాలికకు వేధింపులు

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశాడు. బ్లాక్ మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు వీడియో రికార్డు చేసి బాలికను వేధించాడు.
వీడియో షూట్ చేసిన ఫోన్ ను బాలిక పగులకొట్టి ఇద్దరు గొడవపడుతుండగా చూసిన మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు. దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.