తెలంగాణ
Raghunandan Rao: నోటితో నవ్వడం నొసలుతో వెక్కిరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే

Raghunandan Rao: కాంగ్రెస్‌పై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటితో నవ్వడం నొసలుతో వెక్కిరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బీసీ ప్రయోజనాలు కాపాడుతామంటునే బీసీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. వరంగల్ విమానాశ్రయం బీజేపీ వల్లే వచ్చిందన్నారు.
వరంగల్ విమానాశ్రయం కాంగ్రెస్ వల్లే వచ్చిందని అనడం అవగాహన రాహిత్యమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీజేపీ మాత్రమేనని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. సొంత గూటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని అంటున్న ఎంపీ రఘునందన్.