తెలంగాణ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కొనసాగుతున్న బంద్

చిరు వ్యాపారుల బ్రతుకులో చీకటి నింపిన మా ర్వాడిలను ఉస్మానియా జేఏసీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బందు విజయవంతంగా కొనసాగుతుందని దుబ్బాక జేఏసీ కమిటీ నాయకులు తెలిపారు. మార్వాడీలు తెలంగాణకు వచ్చి చిరు వ్యాపారుల నోట్లో మట్టి కొడుతున్నారని జేఏసీ నాయకులు అన్నారు.
మార్వాడి హటావో తెలంగాణ బచావో అని నినాదంతో దుబ్బాక బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బంద్‌కు వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నాయని తెలిపారు.ఈ బంద్‌తో మార్వాడీల పెత్తనంపై ఉక్కు పాదంమోపాలని అన్నారు.



