తెలంగాణ

Dog Attack: రాజన్న భక్తులపై పిచ్చికుక్క దాడి

Dog Attack: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్కలు ఇలా ప్రజలపై దాడికి పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button