ఆంధ్ర ప్రదేశ్

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఐపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్‌ కాలేజీ వద్ద నిరసనలు చేశారు.

అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్నినానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వొద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేయటం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మచిలీపట్నం పీఎస్ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button