జాతియం
బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు

బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. డీకే శివకుమార్ నివాసానానికి సిద్ధరామయ్య వెళ్లారు. సిద్ధరామయ్యకు నాటు కోడితో డీకే బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సిద్ధరామయ్య ఇంట్లో డీకే అల్పాహారం చేశారు.
సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఎన్నికల వరకు సీఎం పదవిలో ఉంటానని సిద్ధరామయ్య అంటున్నారు. పవర్ షేరింగ్ ఫార్ములాపై ఇద్దరు నేతల అనుచరులు కసరత్తు చేస్తున్నారు. కర్నాటక సీఎం మార్పుపై ఊహాగానాలకు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.



