ఆంధ్ర ప్రదేశ్
యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి సేవలో మంత్రి జనార్దన్ రెడ్డి

Janardhan Reddy: కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలో యాగంటిలోని ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. తెల్లవారుజామున యాగంటికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు మంత్రి దంపతులు.



