ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హోంమంత్రి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.



