తెలంగాణ
కృష్ణానగర్లో పేలిన వాషింగ్ మెషిన్

హైదరాబాద్ పరిధిలోని యూసుఫ్గూడా కృష్ణానగర్లో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ శబ్ధంతో వాషింగ్ మెషిన్ పేలడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. జైన్ టెంపుల్ సమీపంలో ఉన్న నివాస గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుడులో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. వాషింగ్ మెషిన్ పేలుడుతో ఇంట్లో స్వల్ప ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.



