తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ వెళ్లారు.



