ఆంధ్ర ప్రదేశ్

TDP: మహానాడు గ్రాండ్ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ నింపిన తండ్రీకొడుకులు

TDP: పాలెగాళ్ల రాజ్యంగా ప్రఖ్యాతి గాంచిన కడపజిల్లాలో మూడురోజుల పసుపు పండగ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ముగిసింది. ఒకనాటి పూర్వవైభవానికి ప్రతీకగా మారింది. కడప వేదికగా మహానాడు జరగబోతోందన్న అంశం బయటకు పొక్కగానే మిలియన్ డాలర్ల మదిలో అనుమానాలు మెదిలాయి. అన్నింటినీ పటాపంచలు చేస్తూ కడపలో మహానాడు చరిత్రలో ఎప్పుడూ జరగనంత
ఉత్సాహంతో.. ఉద్వేగంతో విజయవంతమైంది..

మహానాడు కార్యక్రమంలో తొలి రెండు రోజులు పార్టీ ప్రతినిధులతో కళకళ లాడితే మూడోరోజు తెలుగు దండు యుద్ధ సైనికులై కడపను ముంచెత్తారు. అన్ని దారులు కడప వైపే సాగగా రహదారులన్నీ స్తంభించిపోయాయి. మహా ప్రాంగణం మధ్యాహ్నం 12 గంటలకే నిండిపోయింది. ఆ తర్వాత రావాలనుకున్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గంటగంటకూ పోటెత్తున్న కార్యకర్తలతో రోడ్లు సైతం పసుపు సైనికులతో నిండిపోయాయి. సభ మొదలై ప్రముఖులంతా మాట్లాడి అభిమాన నేతలు నారా లోకేష్ నారా చంద్రబాబు ప్రసంగించే సమయానికైనా చేరుకుంటామని కార్యకర్తలు కాంక్షించినా ఫలితం లేకపోయింది.

వేలమంది కార్యకర్తలు బహిరంగ సభ వద్దకు చేరుకోలేని పరిస్థితి. వాహనాలపైకి ఎక్కి నేతల ప్రసంగాలను వినే ప్రయత్నం చేశారు. ఇక పార్టీ ముఖ్యనేతలైన చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కార్యకర్తల మనోధైర్యాన్ని ఇచ్చే వాడి వేడి ప్రసంగాలను ఇచ్చారు. ఒక వైపు ఏడాది పాలనలో సాగిన అభివృద్ధి మంత్రాలను ఉటంకిస్తూనే గత ప్రభుత్వం రగిల్చిన మిగిల్చిన అనుభవాలను గుర్తు చేశారు. గడిచిన వైసీపీ పాలన కేసులు జైళ్లు దౌర్జన్యాలు అక్రమాలు భూకబ్జాలు లిక్కర్ మాఫియాలు ఇవి తప్పితే పాలన చేసింది ఎక్కడా అంటూ ప్రశ్నించారు.

ఇక వెనుకబడిన సీమ కోసం రాయలసీమ మిషన్ పేరుతో అభివృద్ధి జరగబోతోందని స్పష్టం చేశారు. సీమకు గుండెకాయ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ పనులు జూన్ 12 నుంచి ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించడం విశేషం. ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా పలు బ్రాండెడ్ కంపెనీలు వచ్చాయని ఇంకా మరిన్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

ఇక యువనేత లోకేష్ సైతం కడప గడ్డపై నుంచి సీమ అభివృద్ధి మంత్రాన్ని జపించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగం అంటూ ఇద్దరు నేతలు పలు మార్లు ఉటంకించడం పసుపు సైనికుల్లో ధైర్యాన్ని నింపింది. ఏది ఏమైనప్పటికీ జగన్ ఇలాకా కడపలో మహానాడు ఏం జరుగుతుందిలే అదొక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ గా మిగిలిపోతుందన్న వాళ్ళ మాడును పగలగొట్టారు పసుపు సైనికులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button