ఆంధ్ర ప్రదేశ్
Srisailam: రికార్డు స్థాయిలో మల్లన్న హుండీ ఆదాయం

Srisailam: నంద్యాల జిల్లా రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం సమకూరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండి లెక్కింపు చేశారు ఆలయ అధికారులు. కార్తీక మసోత్సవాలలో రికార్డు స్థాయిలో మల్లన్నకు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 33 రోజుల హుండీ ఆదాయం 7 కోట్ల 27 లక్షలు 26 వేలు 400 నగదు గత సంవత్సరంతో పోలిస్తే 1కోటి 30 లక్షల 34వేల 024 రూపాయల అధిక రాబడి 117 గ్రాముల 800 మిల్లీ గ్రాముల బంగారం,7 కేజీల 230 గ్రాముల వెండి లభ్యం నగదుతోపాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం హుండీ లెక్కింపులో పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు, అధికారులు.



