తెలంగాణ
తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల కీలక నిర్ణయం

తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మెబాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించకుంటే 12 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించాయి. 12 వందల కోట్లు ఇస్తామని 200 కోట్లే చెల్లించారని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది.
ఈ నెల 12లోగా వెయ్యి కోట్లు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే విద్యార్థులతో కలసి చలో హైదరాబాద్ చేపడతామని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య హెచ్చరించింది.



