The Raja Saab: వింటేజ్ రెబల్ స్టార్ బ్యాక్.. ప్రభాస్ డాన్స్ ఝలక్!

The Raja Saab: మారుతీ తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వింటేజ్ లుక్‌లో అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో ప్రభాస్ కనిపించడం అభిమానులను ఫిదా చేసింది. మిర్చి తర్వాత ఇంత ఎనర్జీ లేదని ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.
‘ది రాజాసాబ్’ చిత్రం నుంచి విడుదలైన ‘రెబల్ సాబ్’ సాంగ్ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. ఈ పాటలో డార్లింగ్ ప్రభాస్ పూర్తిగా వింటేజ్ అవతారంలో కనిపించాడు. గ్రేస్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్‌తో రెబల్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు.
మిర్చి సినిమా తర్వాత ఇంతలా ప్రభాస్ డాన్స్ ఎనర్జీ కనిపించలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. “మిర్చి ప్రభాస్ తిరిగి వచ్చాడు.. రెబల్ స్టార్ ఈజ్ బ్యాక్” అంటూ సోషల్ మీడియా నిండా కామెంట్స్ కిక్కిరిస్తున్నాయి. ప్రభాస్ యాక్షన్ హీరో మాత్రమే కాదు, అద్భుత డాన్సర్ కూడా అని ఈ సాంగ్ మరోసారి రుజువు చేసింది.



