తెలంగాణ
తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్

తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్ జరిగాయి. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలతో నిత్యం జనాలతో కిటకిటలాడే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏసీబీ అధికారుల దాడులతో వేల వేల పోయింది. నకిలీ రిజిస్ట్రేషన్లు, అక్రమ డాక్యుమెంట్లో పై వచ్చిన ఫిర్యాదుల కారణంగానే ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
నిజామాబాద్ అర్బన్ , రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పాటు ఖమ్మం జిల్లా వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు 2.90 లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులకు లభించినట్లు తెలిసింది. ఓ డాక్యుమెంట్ రైటర్ తనకు అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఆ నగదును ఇచ్చేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది.



