సినిమా

Athadu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘అతడు’ రీరిలీజ్ సంచలనం..!

Athadu: టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమాలు రీరిలీజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఈసారి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘అతడు’ రీరిలీజ్‌కు సిద్ధమైంది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’ సినిమా రీరిలీజ్‌కు రంగం సిద్ధమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మహేశ్ బాబు స్టైలిష్ నటన, బ్రహ్మానందం కామెడీతో ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రీరిలీజ్ హక్కులను కాకినాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ. 3.06 కోట్లకు కొనుగోలు చేశారు.

ఇది రీరిలీజ్ సినిమాల్లో రికార్డ్ ధరగా నిలిచింది. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు రీరిలీజ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో, ‘అతడు’ కూడా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉంది. మహేశ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు కానుకగా వస్తున్న ‘అతడు’ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button