తెలంగాణ

Medchal: కీచక కానిస్టేబుల్.. న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసి..

Medchal: మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారు. కొంతమంది కీచక పోలీసులు చేసే చేష్టల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ పైనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పని చేయాలి. కానీ ఓ రక్షక భటుడు.. భక్షుకుడిగా మారిపోయి ఓ యువతిని కాటేశాడు. సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని.. న్యాయం చేస్తానని నమ్మించి లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఆపై బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

మేడ్చల్‌ జిల్లా ఇందిరానగర్‌ కాలనీలో ఉంటుంది సదరు యువతి. అయితే కొందరు డబ్బుల విషయమై తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. క్రైమ్‌ విభాగం కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి సమస్య పరిష్కరిస్తానంటూ హామీఇచ్చాడు. తన సెల్‌ఫోన్‌ నంబర్‌ను యువతికి ఇచ్చాడు. ఆపై ఆమెను తన ఇంటికి రప్పించిపెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ను నమ్మిన యువతి తనతో శారీరకంగగా దగ్గరైంది. ఈ క్రమంలోనే యువతి గతేదాడి జూలైలో గర్భం దాల్చడంతో… ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు.

ఇక గర్భం దాల్చాక పెళ్లి చేసుకోవాలని యువతి సుధాకర్‌ను కోరింది. దీంతో దానికి ఒప్పుకోని సుధాకర్ స్నేహితుడితో కలిసి సుధాకర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మరోవైపు సుధాకర్‌కు ముందే పెళ్లైనట్టు తెలియడంతో..యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు. సుధాకర్‌ను రిమాండ్ కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button