తెలంగాణ
Jeevan Reddy: నీది ఏ పార్టీ.. మా పార్టీ గురించి మాట్లాడటానికి నువ్వెవరు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీ ఫామ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు..? పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. పదేళ్లు కష్టపడి పార్టీ జెండా మోసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. నీది ఏ పార్టీ.. మా పార్టీ గురించి మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయన ప్రశ్నించారు.
మా పార్టీ గురించి టికెట్ల గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు అని మండిపడ్డారు. రాజ్యాంగం నిబంధనలు నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కంచుకోటం 50 స్థానాల్లో గెలుస్తామన్నారు.



