సినిమా

ధురంధర్ ఎఫెక్ట్.. ట్రెండింగ్లో రణవీర్ ఫస్ట్ మూవీ!

రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటి సంచలనం సృష్టిస్తోంది. ఈ మేనియాలో రణవీర్ తొలి చిత్రం ‘బ్యాండ్ బాజా బారాత్’ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది. 15 సంవత్సరాల సందర్భంగా జనవరి 16న థియేటర్లలోకి రానుంది.

2025 డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ నాలుగో వారంలోనూ భారీ వసూళ్లు సాధించి 1200 కోట్ల మార్కును అధిగమించింది. సీక్వెల్ కూడా మార్చి 19న రానుంది. ఈ విజయోత్సాహంలో రణవీర్ సింగ్ డెబ్యూ చిత్రం ‘బ్యాండ్ బాజా బారాత్’ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

2010లో విడుదలైన ఈ సినిమాకి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో టాప్ హిట్‌గా నిలిచింది. వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకర్షించింది. పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో జనవరి 16న థియేటర్లలో రీ-రిలీజ్ జరగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button