ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం

Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చక్రస్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించింది టీటీడీ. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాత:కాల కైంకర్యాలు ముగిసిన అనంతరం శ్రీవారి సుదర్శన చక్రన్నాని పల్లకిలో మాడావీధిల్లో ఉరేగించి పుష్కరిణికి తీసుకెళ్లారు. వారహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకించి వేదమంత్రోచ్ఛరణల నడుమ శుభముహుర్తంలో చక్రస్నానం నిర్వహించారు అర్చకులు.



