ఆంధ్ర ప్రదేశ్

కుక్క కాటుకు గురై బాలుడి దుర్మరణం

నాలుగేళ్ల బిడ్డ చూడగానే ముద్దొచ్చే రూపం చలాకీగా తిరుగుతుంటే ఆ దంపతులు మురిసిపోయారు 15 రోజుల క్రితం ఓ శునకం అమాంతం మీదపడింది ఛాతిని చీల్చి గాయం చేసింది. అయినా చిన్ని గుండె ధైర్యంగా ఉంది. చవితి వేడుకల్లో సందడంతా తనదే అన్నంతగా నృత్యం చేస్తుంటే అమ్మానాన్న సంబరపడ్డారు.

రెండు రోజుల నుంచి చిన్నారిలో ఒకటే భయం నీరు చూసినా. శబ్దం విన్నా వణుకే పరిస్థితి గమనించి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆ పసి ప్రాణం ఊపిరి ఆగిపోయింది ఆ తల్లిదండ్రుల గుండెలపై మాయని గాయం చేసింది.

పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన లోహిత్‌ను గత నెల 17న ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో వీధి కుక్క దాడి చేసి ఛాతిపై కరిచింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. తర్వాత గాయాల నుంచి కోలుకున్నాడు.

ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు రవళి, ఈశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button