తెలంగాణ
Medak: భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం

Medak: అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతులమవుతోంది.వర్షాలకు మెదక్ లోని సాయినగర్ కాలనీ జలమయమైంది.హవేలీ ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా వద్ద వాగు ఉదృతికి రాకపోకలు నిలిచిపోయాయి.రాజ్ పేట తండా పరిధిలోని కాప్రయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హావేలిఘనపూర్ మండలంలో పంటపొలాలు నీటమునిగాయి.
రేగోడ్ మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగిపొర్లుతోంది.మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది.దీంతో ర్యాల మడుగు- మెదక్ కి రాకపోకలు నిలిచాయి.గ్రామంలో విద్యుత్ వైర్లపై భారీవృక్షం పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.



