తెలంగాణ

Telangana Thalli: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ని తెలంగాణ త‌ల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చిన ప్ర‌భుత్వం

Telangana Thalli: తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మారుస్తూ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చి నామకరణం చేశారు..

నగరంలోని ప్రముఖ ఫ్లైఓవర్ అయిన తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఫ్లైఓవ‌ర్‌పై తెలంగాణ త‌ల్లి అని బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరును నామకరణం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి తెలుగుతల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button