తెలంగాణ
Karthika Masam: వేములవాడ రాజన్న ఆలయంలో కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రం

Karthika Masam: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయానికి క్యూ కట్టిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన, మూడో సోమవారం భీమేశ్వర స్వామి ఆలయంలో లింగార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించానున్నారు. మరోవైపు రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కోడె మొక్కులను నిలిపివేశారు. రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకోవాలని భక్తులకు సూచించింది ఆలయ కమిటీ.



