Kavitha: కవిత యుద్ధం ఎవరిపై? కవిత వెంట నడిచేవారెవరు?

Kavitha: కవిత రాజకీయ వ్యూహాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఆమె పోరాటం ఎవరిపై? అధికార పార్టీపై కవిత పోరాటం సాగిస్తుందా? ప్రతిపక్షాన్ని టార్గెట్‌గా చేసుకుని కవిత పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందా? ఆమె ఎన్నుకొంటున్న సమస్యలు పొలిటికల్ మైలేజీ ఇస్తున్నాయా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న కవిత..అధికార ప్రతిపక్షాల్లో ఎవరిని టార్గెట్ చేసుకోనుంది. కవిత ఎవరో వదిలిన బాణం అని మిగతా పార్టీలు ఎందుకు అంటున్నాయి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత రాజకీయ ప్రచారంలో తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తుందా? కవితకు తెలంగాణ రాజకీయాల్లో సొంతంగా ఎదిగేందుకు స్కోప్ ఉందా? కవిత గెలువకున్నా గెలిచేవాళ్లను ఓడించేలా దెబ్బకొట్టగలదా? కవిత కాంగ్రెస్‌కు బీ టీమ్ అనే ప్రచారం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? కవితను బీజేపీ, కాంగ్రెస్ లైట్ తీసుకుంటున్నాయా? వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో వేచి చూస్తున్నాయా? అనే ప్రశ్నలు పొలిటికల్ అనలిస్టుల మదిని తొలుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వెలేసిన తర్వాత కవిత అడుగులు ఎటువైపు అనే చర్చ రోజు రోజుకీ పెరుగుతోంది.



