సినిమా
Mahakali: ప్రశాంత్ వర్మ మహాకాళి షూటింగ్ ప్రారంభం

Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. లేడీ సూపర్ హీరో మూవీగా ఈ మూవీ రానుంది. ‘హను-మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’ తాజా చిత్రం. పూజా కొల్లూరు డైరెక్షన్‌లో ఈ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. ఆర్‌కెడి స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తారని టాక్. ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్స్, యాక్షన్‌తో ఈ చిత్రం మరో సంచలనం సృష్టించనుంది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.