సినిమా

Mad square: తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపేస్తున్న 'మ్యాడ్ స్క్వేర్'

Mad Square : యూత్‌ను ఆకట్టుకునే కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రిలీజైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఊచకోత కోస్తోంది.

‘మ్యాడ్ స్క్వేర్’ ఏపీ-తెలంగాణలో మొదటి 3 రోజుల్లోనే రూ. 14.91 కోట్లు సాధించి సత్తా చాటింది. విశేషం ఏంటంటే, 3వ రోజు ఈ సినిమాకు అత్యధిక షేర్ రోజుగా నమోదైంది. ఈ జోరుతో ‘మ్యాడ్ స్క్వేర్’ లాభాల జోన్‌లోకి దూసుకెళ్తోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ యూత్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటోంది.

రోజురోజుకు కలెక్షన్స్ గ్రాఫ్ ఎగబాకడంతో సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పూర్తి ఊపులో కనిపిస్తోంది. కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తుండటం విశేషం. ‘మ్యాడ్ స్క్వేర్’ రచ్చ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button