Kuldeep Sengar: ఉన్నావ్ రేప్ కేసులో కీలక ఆదేశాలు.. సెంగర్ బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే

Kuldeep Sengar: ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు, బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సెంగర్‌ను కస్టడీ నుంచి విడుదల చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ విషయంలో సీబీఐ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ సెంగర్‌కు నోటీసులు జారీ చేసింది.
2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కుల్దీప్ సింగ్ సెంగర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ఢిల్లీకి బదిలీ చేశారు. ఇటీవల సెంగర్ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితురాలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేయగా, సీబీఐతో పాటు బాధితురాలి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.



