తెలంగాణ
School Bus Fire: ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు

School Bus Fire: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రావూస్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను ఇళ్లలో దింపేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి విద్యార్థులను కిందకు దింపేశాడు. ఫైర్ ఎక్స్టింగ్విషర్‌తో మంటలను అదుపు చేసిన అదుపు కాకపోవడంతో స్థానికులు నీళ్లు తెచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



