తెలంగాణ
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేటీఆర్

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే సంకల్పంతోనే మాజీ సీఎం కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌ని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులకు అన్ని సౌకర్యాలు అందించేలా దాదాపు 60 ఎకరాల్లో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో 1200 కోట్లతో టిమ్స్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు.



