తెలంగాణ
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కులగణన సహా కార్డులకు సంబంధించిన.. ఏ జాబితాలోనూ పేర్లు లేనివారి నుంచి ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకు జరిగే గ్రామసభల్లో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12లక్షల 7వేల 558 దరఖాస్తులకు సంబంధించి 18లక్షల 515 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు తెలిపింది. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులనూ పరిశీలించనున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.