NTR – నీల్ సినిమాకి బ్రేక్?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఫుటేజ్ స్క్రాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథలో మార్పుల కోసం ఎన్టీఆర్ సూచనలు చేశారని టాక్. ఈ వివాదం ఏమిటో తెలుసుకుందాం.
ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం టాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టించింది. కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నాయి. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం జూన్ 25, 2026న రిలీజ్ కానుంది. అయితే, తాజాగా వస్తున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. మొదటి షెడ్యూల్‌లో తీసిన ఫుటేజ్‌ను స్క్రాప్ చేశారని, రీషూట్ సీన్స్‌పై ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్.
కథలో మార్పులు చేయాలని ఆయన సూచించారని, దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మనస్పర్థలు వచ్చాయని వినిపిస్తోంది. ఈ కారణంగా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నాడు. మరి ఈ తాజా వివాదం నిజమెంత అనే దానిపై నిర్మాతలు స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.



