మారుతి వ్యాఖ్యలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

Maruthi: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒక మీడియం రేంజ్ హీరోను పాన్ ఇండియా స్టార్‌గా మార్చారనే కామెంట్ దూమారం రేపుతుంది. దర్శకుడు మారుతి ప్రభాస్‌ను మీడియం రేంజ్ హీరోగా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వివాదాన్ని రేపుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బాహుబలి సిరీస్‌తో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి గొప్పతనాన్ని అందరూ కొనియాడుతుంటారు. ఒక సాధారణ మీడియం రేంజ్ హీరోను, జాతీయ స్థాయి స్టార్‌గా మార్చిన ఘనత ఆయనదే. అయితే ఇటీవల రాజా సాబ్ ఈవెంట్లో, దర్శకుడు మారుతి ప్రభాస్‌ను, మీడియం రేంజ్ హీరోగా సూచించాడు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు మారుతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం ట్రెండింగ్‌లో ఉంది. రాజమౌళి ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్‌ను గుర్తు చేస్తూ అభిమానులు మారుతి వ్యాఖ్యలను తప్పుపడుతూ, అతన్ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



