సినిమా
Samantha: అభిమానుల అత్యుత్సాహం.. మొన్న నిధి, ఇప్పుడు సమంత!

Samantha: మొన్న నిధి.. నిన్న సమంత.. హీరోయిన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతున్నారు. ది రాజాసాబ్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన సంఘటన మరువక ముందే సమంతకు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
తాజాగా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత.. తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడ్డారు. బాడీగార్డ్‌లు ఆమెను జాగ్రత్తగా కారు ఎక్కించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



