సంక్రాంతికి ఫుల్ కామెడీ గ్యారెంటి అంటున్న మీనాక్షి!

Meenakshi Chaudhary: సంక్రాంతి పండుగ సందడికి తగినట్టుగా సరికొత్త వినోద చిత్రంగా ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలోకి రాబోతోంది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కామెడీ కొత్తగా ఉంటుందని నటి మీనాక్షి చెబుతున్నారు. ఆమె కామెడీ ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు చూద్దాం.
సంక్రాంతి సందడికి సరిగ్గా సరిపడేలా ‘అనగనగా ఒక రాజు’చిత్రం జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా మెరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణతో ఈ చిత్రం తెరకెక్కింది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తన పాత్ర పేరు చారులత అని, సంపన్న కుటుంబంలో పుట్టి యువరాణిలా పెరిగిన అమాయక, సున్నిత స్వభావం గల అమ్మాయి అని వివరించారు. ఈ చిత్రంలో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తున్నానని, నవీన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని, సరికొత్త వినోదాన్ని అందిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. భీమవరం బాల్మా, రాజుగారి పెళ్ళిరో లాంటి క్యూట్ మాస్ డ్యాన్స్ నెంబర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు.



