అంతర్జాతీయం
Sunita Williams: సునితా విలియమ్స్ రాకపై నాసా బిగ్ అప్డేట్

Sunita Williams: సునీతా విలియమ్స్ భూమికి చేరేందుకు మార్గం సుగమం అయ్యింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-10 వ్యోమగాములు ఇప్పటికే చేరుకున్నారు. తాజాగా.. ఐఎస్ఎస్‌తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం అయినట్లు తెలుస్తుంది. అయితే.. రేపు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. మొత్తానికి సునీత, విల్మోర్‌తోపాటు భూమి పైకి మరో ఇద్దరు వ్యోమగాములు రానున్నారు.
దాదాపు తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి ని చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లో వారు తిరుగుపయనం మొదలవ్వనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది.