తెలంగాణ
Mastan Sai: నార్సింగ్ పోలీసుల కస్టడీలో మస్తాన్ సాయి

Mastan Sai: జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు రెండో రోజు నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయిపై సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ కేసులు పెట్టారు. ఇప్పటికే నగ్న వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చింది.
ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు ఉన్నాయని లావణ్య పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్, నగ్న వీడియోలపై మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన నేపథ్యంలో ఆ డ్రగ్స్ ఎక్కడ నుండి వచ్చాయి.. ఎవరు సప్లై చేశారు అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.