తెలంగాణ
Khammam: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

Khammam: గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో సొంత అక్కాచెల్లెళ్లు సర్పంచ్ బరిలో ఉన్నారు. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అక్కాచెల్లెళ్లు చిట్టూరి రంగమ్మ, మల్లెంపూడి కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు.
వారి ఇద్దరి మధ్య ఏనాడు విభేదాలు లేవని కలిసి మెలిసి ఉండే వారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంగర గ్రామంలో మొత్తం నాలుగు వందల ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో రంగమ్మ సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు.



