HIT3: హిట్ 3’ బాక్సాఫీస్ రచ్చ.. యూఎస్‌లో 1 మిలియన్

Hit3: నాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది.
‘హిట్’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘హిట్ 3’ నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో నాని క్రేజ్ మరోసారి రుజువైంది. ప్రీమియర్ షోలతోనే 8 లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, డే 1తో కలిపి 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను సునాయాసంగా అధిగమించనుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు బిగ్ ప్లస్‌గా నిలిచింది.
వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ‘హిట్ 3’ నాని రేంజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తోంది. ‘హిట్’ సిరీస్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవనున్న ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద నాని స్టామినాను చాటుతోంది. మరిన్ని వసూళ్ల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.