సినిమా
మహావతార్ నరసింహ: యూఎస్‌లో సంచలనం!

Mahavatar Narsimha: చిన్న బడ్జెట్‌తో రూపొందిన ‘మహావతార్ నరసింహ’ యూఎస్ మార్కెట్‌లో సంచలన వసూళ్లు సాధిస్తోంది. దర్శకుడు అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం 3 లక్షల డాలర్ల మార్క్ దాటి అదరగొడుతోంది. భక్తి, యాక్షన్ అద్భుత కలయికతో ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
దర్శకుడు అశ్విన్ తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహ’ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించింది. భక్తి, యాక్షన్ డ్రామాతో కూడిన ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో ఆలస్యంగా విడుదలైనప్పటికీ సంచలన వసూళ్లు రాబడుతోంది.
గత వారం రిలీజైన ఈ సినిమా కేవలం కొన్ని రోజుల్లోనే 3 లక్షల డాలర్ల మార్క్‌ను అధిగమించి బలమైన పరుగు కొనసాగిస్తోంది. సామ్ సిఎస్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా ఆదరణ పొందుతోంది. ఈ విజయంతో టీమ్ ఉత్సాహంలో ఉంది.



