తెలంగాణ
KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం

KCR: కాసేపట్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం జరగనుంద.ి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొననున్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభల తేదీలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.



