ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగల బీభత్సం

తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగల బీభత్సం సృష్టించారు. మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. మహిళ ఒంటి ఉన్న 6తులాల బంగారు ఆభరణాలు దొంగలు దోపిడీ చేశారు. అలారం లాగేందుకు ప్రయత్నిస్తుండగా మహిళపై కత్తితో దాడి చేశాడు. దాడిలో మహిళ చేతికి గాయమైంది. బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



