తెలంగాణ
KTR: తెలంగాణ నలుమూల కాంగ్రెస్ కు వ్యతిరేకత

KTR: తెలంగాణ భవన్ లో సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళితే ప్రజలు కొడతారని అన్నారు కేటీఆర్. సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ బయట తిరగే పరిస్థితి లేదని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలకే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు కేటీఆర్. తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా కాంగ్రెస్, బిజెపి ఎంపీలు నోరు మెదపలేదని ఫైరయ్యారు.