సినిమా

Aarya2: ఏప్రిల్‌ 5న అల్లు అర్జున్‌ ‘ఆర్య-2’ రీరిలీజ్‌

Aarya2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబో అంటే ఫ్యాన్స్‌కి ఊహించని హైప్! వీరి హిట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య-2’ అప్పట్లో బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేసింది. మ్యూజికల్ హిట్‌గా మారి, అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌తో మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న ఈ టైంలో, ‘ఆర్య-2’ని ఏప్రిల్ 5న గ్రాండ్‌గా తీసుకొస్తున్నారు మేకర్స్. టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే సెన్సేషనల్ రెస్పాన్స్ కనిపిస్తోంది. సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో కేవలం 2 నిమిషాల్లో టికెట్లు సోల్డ్ ఔట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ రీ-రిలీజ్‌కి వస్తున్న క్రేజ్ చూస్తే, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అల్లు అర్జున్ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ ఎలా రిపీట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉండగా, ఈ రీ-రిలీజ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button