ఆంధ్ర ప్రదేశ్
Anantapur: భార్య భర్తల మధ్య గొడవలు.. బాలుడిని చంపిన పక్కింటి వ్యక్తి

Anantapur: అనంతపురం అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో బాలుడిని చంపేశాడు నిందితుడు పెన్నయ్య. కుమారుడు సుశాంత్ కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు గోవిందు హరి, నాగవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం రాత్రే బాలుడిని హతమార్చి ఇంటి వెనుకున్న దోబీ ఘాట్లో పూడ్చిపెట్టినట్లు నిందితుడు పెన్నయ్య పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. అభం శుభం తెలియని బాలుడిని చంపేయడాన్ని తల్లితండ్రులు, స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. లోకం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



