Nikki Haley: భారత్‌ను దూరం చేస్తే అమెరికాకే నష్టం… ట్రంప్‌కు నిక్కీ హేలీ హెచ్చరిక

Nikki Haley: ఊహకందని వ్యక్తి ట్రంప్ ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు! దీంతో అమెరికాకు నష్టం చైనాకు లాభం రష్యా–ఇండియాలను మరింత దగ్గర చేస్తోన్న ఈ చర్య, బుద్ధి తక్కువ పని అంటోంది అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ. భారతదేశంపై సుంకాలు అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్యతో అమెరికా–భారత్ సంబంధాలు ఖతమవుతాయని నిక్కీ హేలీ హెచ్చరించారు. భారతీయ వస్తువులపై 25 శాతానికి అదనంగా రష్యా చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాలు వడ్డించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అమెరికా చర్యలతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ చర్చల్లో అమెరికా రోల్ ఏమీ లేదని చెప్పడం, ట్రంప్‌కు ఆగ్రహం కలిగించింది. ఇది రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. రెండు దేశాల మధ్య టారిఫ్స్ విషయంలో ఒప్పందం దిశగా సాగుతున్న ప్రయత్నాలు ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. చైనాను అదుపులో పెట్టాలంటే అమెరికా–భారత్ సంబంధాలు పటిష్టంగా ఉండాలని, భారత్‌ను చైనా లాగా ప్రత్యర్థిగా చూడొద్దని న్యూస్‌వీక్ ఆర్టికల్‌లో నిక్కీ హేలీ స్పష్టంగా చెప్పారు.
ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని ఎదిరించగల ఏకైక దేశం భారత్. అలాంటి దేశంతో సంబంధాలు దెబ్బతీయడం అమెరికాకు వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె హెచ్చరించారు. చైనా నుంచి సరుకు రవాణాపై అమెరికా ఆంక్షలు విధించినా, ఇండియాతో ఆ లోటు భర్తీ చేసుకున్నామని, ఇప్పుడు ఎవరు ఆ రోల్ పోషిస్తారని ఆమె ట్రంప్‌ను ప్రశ్నించారు. దుస్తులు, ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, తక్షణం ఉత్పత్తి చేయలేనప్పుడు, వాటిని తయారు చేయగల సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందని ఆమె అన్నారు. తద్వారా అమెరికాకే నష్టం కలుగుతోందన్నారు.
రక్షణ రంగంలో భారత్‌తో కలిసి పనిచేయడం వల్ల వాణిజ్యపరంగా మేలు కలుగుతుందన్నారు. అమెరికా రక్షణ పరికరాలకు ఇండియా కీలకమైన మార్కెట్ అని, ప్రపంచ స్వేచ్ఛ యాంగిల్ చూసినప్పటికీ విలువైన భాగస్వామి అని ఆమె స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా తక్కువ దళాలను పెట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో, భారత్ పెరుగుతున్న ప్రభావం అక్కడి స్థిరత్వానికి మేలు చేస్తుందని హేలీ విశ్లేషించారు. చైనాకు ఇంధన సరఫరా భారత్ కేంద్రంగా జరుగుతుందని, తద్వారా ఇండియా విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆమె ట్రంప్‌కు హితబోధ చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించిందన్న హేలీ, వృద్ధాప్య సమాజంగా మారుతున్న చైనాతో పోలిస్తే, యువ శ్రామిక శక్తి భారత్ బలమని వచ్చే రోజుల్లో అది ఇండియాతోపాటు, అమెరికాకు లాభదాయమని అన్నారు. ప్రపంచ పోకడలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా చూస్తున్న తరుణంలో, డ్రాగన్ కంటున్న కలలకు భారత్ పెద్ద అడ్డంకి అవుతుందని, అంతిమంగా అది అమెరికా ఆధిపత్య ధోరణికి మేలు కలిగిస్తుందని ఆమె అన్నారు.
భారత్ ఎదుగుదల స్వేచ్ఛా ప్రపంచానికి బెదరింపు కాదని, కానీ చైనా ఎదిగితే అది ప్రపంచదేశాలకు పెను ముప్పు వాటిల్లేలా చేస్తోందని ఆమె పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ లక్ష్యాలను సాధించాలంటే భారత్‌తో సంబంధాలు పటిష్ఠం చేసుకోవాలని, తుంచుకోరాదని ఆమె ట్రంప్‌కు హితబోధ చేశారు.



