ఆంధ్ర ప్రదేశ్

Amaravati: రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై వీడియో రిలీజ్

Amaravati: రాజధాని అమరావతి ఐదేళ్ల గ్రహణం నుంచి బయటపడి.. మళ్లీ వెలుగుబాట పట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. గ్రహణం ఎంతో కాలం ఉండదన్నారు ఆయన. పునర్నిర్మాణానికి సిద్ధం అవుతున్న అమరావతి అంటూ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. 2014-19 మధ్య రాజధానిలో పూర్తయిన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలు, ఉండవల్లి గుహలు, వెంకటపాలెంలో టీటీడీ సహకారంతో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, విట్ అండ్ ఎస్‌ఆర్‌ఎం, అమృత లాంటి విద్యాసంస్థలు, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, రాజధాని మీదుగా వెళ్లే విజయవాడ పశ్చిమ బైపాస్, కృష్ణా నది మీద కట్టిన వంతెన, అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలు తదితరాల్ని వీడియోలో చూపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన జంగిల్‌ క్లియరెన్స్‌నూ ప్రస్తావించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button