తెలంగాణ
Marriage: ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన యువకుడు

Marriage: ఒకే పెళ్లి. ఇద్దరు భార్యలు.. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండీ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వింత పెళ్లి ఘటన చోటు చేసుకుంది. జైనూర్ మండలం అడ్డేసారా గ్రామానికి చెందిన ఆత్రం ఛత్రుషావ్ కు జంగుబాయి, సోన్ దేవి లకు మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది.
వారి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఘాటుగా మారిపోగా. పరస్పరం ఒకరు లేకుండా మరొకరు ఉండలేని స్థితికి చేరింది. దీంతో విషయం యువతుల ఇరు కుటుంబాల్లో చెప్పి ఒప్పంచాడు. చేసేది లేక ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇంకేముంది బంధువుల సమక్షంలో ఇద్దరినీ పెళ్లాడాడు.