తెలంగాణ
MLC Elections: రేపే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక

MLC Elections: రాష్ట్ర రాజకీయాల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిగా మారింది. రేపు జరుగనున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు సాగనుంది. ఇందుకోసం GHMC ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.
లోకల్ బాడీ ఎన్నికలకు కొర్పారేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేయనున్నారు. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 31మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం ఓటర్లు 112 మంది ఉన్నారు. ఈనెల 25న GHMC ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ చేయనున్నారు.