తెలంగాణ
Waqf Act: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

Waqf Act: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణక జరిగింది. సుప్రీం ధర్మాసనం వాదనలు- ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.
ఈ నేపథ్యంలోనేవక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది.